– చంద్రుడి చుట్టూ కాంతి వలయం!
కాణిపాకం : ఆకాశంలో ఒక అరుదైన, సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి వేళ చందమామ చుట్టూ దివ్య వలయం ఏర్పడి ప్రజలను అబ్బురపరిచింది. నింగిలో జాబిల్లికి రత్నాల ఉంగరం తొడిగినట్లున్న ఈ దృశ్యాన్ని చిత్తూరు నగరంలో పలువురు తిలకించి, తమ ఫోన్లలో బంధించారు. ఎత్తులో ఉన్న మేఘాల్లోని మంచు స్పటికాల గుండా చంద్రకాంతి ప్రయాణించినప్పుడు ‘వక్రీభవనం’ చెందడం వల్లే ఈ కాంతి చక్రం ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఇది పూర్తిగా సహజమైన భౌతిక ప్రక్రియ మాత్రమేనని వివరించారు.


