కార్వేటినగరం: రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నింబందనలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీఽ సూచించారు. ‘సురక్షిత చిత్తూరు– మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మండల పరిధిలోని అమ్మపల్లి క్రాస్ వద్ద శుక్రవారం వెయ్యి మందికి ఉచి తంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం వెయ్యి మంది ద్విచక్రవానదారులతో అమ్మపల్లి క్రాస్ నుంచి కార్వేటినగరం పోలీస్టేషన్ వరకు మెగా హెల్మెట్,బై బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. పారిశ్రామిక వేత మాదిరాజు గణేష్‌రాజు వెయ్యి మందికి ఉచితంగా హెల్మెట్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల రోడ్డు ప్రమాద గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో ప్రతి ఏడాది సుమారు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వీరిలో 150 నుంచి 170 మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారని, అదనంగా ప్రతి ఏడాది 400 నుంచి 450 మంది ద్విచక్రవాహన దారులు తీవ్రంగా గాయపడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి విషాదం మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని అన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
మీ కుటుంభాన్ని కాపాడే రక్షణ కవచం
జిల్లాఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని అన్నారు. ద్విచక్రవాహనదారులు ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించా లని సూచించారు. హెల్మెట్ కేవలం తలకు రక్షణ కల్పించే పరికరం మాత్రమే కాదని, అది వ్యక్తిని, కు టుంబాన్ని కాపాడే రక్షణ కవచమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ యువత ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు వేగంకంటే ప్రా ణం ముఖ్యమని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో భా గంగా వెయ్యి మంది హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనాదారులతో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన పారిశ్రామిక వేత్త మా దిరాజు గణేష్‌రాజు, కుమార్ రాజును జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. నగరి ఇన్‌చార్జి డీఎస్పీ రాంబాబు, సీ.ఐ హనుమంతప్ప, ఎస్ బీ ఇన్స్‌పెక్టర్ మురళి, ఎస్‌ఐలు సుమన్, రాజశేఖర్‌రెడ్డి, తేజస్విని, నవీన్‌బాబు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ను అందిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ


