కాణిపాకం: శ్రీ స్వయంభ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్స వాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆల య ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ పనులు చేపట్టగా, ఆలయ విమాన గోపురం, రాజగోపురం, ప్రాకారాలకు నూతన శోభ చేకూరుస్తున్నారు. మరోవైపు ఉత్సవ రోజుల్లో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఎండ, వర్షం నుంచి రక్షణగా వాటర్ ప్రూఫ్ షెడ్లతో పాటు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. భక్తులకు తాగునీరు, ప్రసాదాల వితరణ, భద్రతా చర్యలపై దేవస్థానం అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పనులను పరుగులు తీస్తున్నారు. కాణిపాక క్షేత్రంలో జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత పారదర్శకంగా విజయవంతం చేసేందుకు ఆలయ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.
రంగులు వేస్తున్న
దృశ్యాలు


