సురేష్‌కుమార్‌కు మెరిటోరియస్‌ మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

సురేష్‌కుమార్‌కు మెరిటోరియస్‌ మెడల్‌

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసుశాఖలో పనిచేస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ ఎం.సురేష్‌కుమార్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌కు ఎంపికై నట్లు ఎస్పీ తుషార్‌డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీసు సాయుధ దళంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసి, ప్రస్తుతం ఏఆర్‌ఎస్‌ఐగా ఉన్న సురేష్‌కుమార్‌ విశిష్ట సేవలను గుర్తించి గత ఏడాది ఈ పతకానికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. శనివారం అమరావతిలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో సీఎం చేతులమీదుగా మెడల్‌ అందుకుంటారని తెలిపారు.

న్యాయం కోసం

రోడ్డెక్కిన బాధితులు

పెద్దపంజాణి: మండలంలోని బసవరాజుకండ్రిగ గ్రామంలో సుమారు నెల రోజుల క్రితం సీతారాముడు(35) అనే వ్యక్తి ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు తమకు న్యాయం చేయలేదని బాధితులైన సీతారాముడు కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్టేషన్‌ ఎదుట బైటాయించి సుమా రు అరగంట సేపు ధర్నా చేశారు. సీతారాముడు ఆత్మహత్య చేసుకోలేదని కొందరు హత్య చేశారని ఆరోపిస్తూ హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. విష యం తెలుసుకున్న పలమనేరు రూరల్‌ సీఐ పరశురాముడు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో చర్చించారు. సీతారాముడు హత్యకు గురైనట్లు సరైన ఆధారాలతో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసు కుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

– దరఖాస్తుకు సెప్టెంబర్‌ 15 ఆఖరి తేదీ

చిత్తూరు కలెక్టరేట్‌ : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.జీవనజ్యోతి, కోఆర్డినేటర్‌ గోపీనాయక్‌ తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులకు ఆగస్టు 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దూరవిద్య విధానంలో డిగ్రీ చేయాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా పూర్తయిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్‌ 15 వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అందుబాటులో బీఏ(పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటకల్‌ సైన్స్‌), బీఎస్సీ (మ్యాథ మెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ), బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌), బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) కోర్సులకు అవకాశం ఉందన్నారు. వివరాలకు పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్‌ ఓపెన్‌ స్టడీ సెంటర్‌, 7382929664 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement