మా తల్లిని దూషించడం కలచివేసింది | - | Sakshi
Sakshi News home page

మా తల్లిని దూషించడం కలచివేసింది

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

● లోకేశ్‌ తల్లికో న్యాయం.. మా తల్లికో న్యాయమా! ● ప్రశ్నిస్తే దాడులు చేయడం దారుణం ● వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌

కుప్పం రూరల్‌: ‘టీడీపీ నాయకులు మా తల్లిని దూ షించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. టీడీపీ శ్రేణు లు నా ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. నా తల్లిన అనరాని మాటలు అన్నారు’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌ వాపోయారు. ఆయన మంగళవా రం కుప్పంలో మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు కుప్పంలోనూ నిరసన చేపట్టాం. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మేం చేపట్టిన నిరసనల్ని నిలువరించింది. మేం ఇంట్లో ఉండగా టీడీపీ కూటమి నేతలు ర్యాలీ పేరిట మా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. చెప్పలేని తరహాలో మా తల్లిని దూషించి మనస్తాపానికి గురిచేశారు. నేను బ్యూరోక్రాట్‌ కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులది చీమకు కూడా హానిచేసే స్వభావం కాదు. ఎన్నికల సమయంలో నా బిడ్డను గెలిపించండి.. మీకు మేలు చేస్తాడని ఎన్నికల్లో నా తల్లి ప్రచారం చేశారే తప్ప ఎక్కడా ఎవరిని దూషించలేదు. అలాంటి మా తల్లిపై టీడీపీ మూకలు బూతులు మాట్లాడడం దారుణం. నీతులు బోధించే చంద్రబాబు ఇప్పుడు తన పార్టీ శ్రేణులతో బూతులు తిట్టించడం ఎంతవరకు న్యా యం? తన తల్లిని దూషించారని నానాయాగీ చేసిన లోకేశ్‌కు ఇతరుల తల్లి ఒక తల్లే అని గుర్తుకు రాలేదా?. హిందూ ధర్మాన్ని బోధించే బీజేపీ, హైందవ వాదాన్ని జపించే పవన్‌కల్యాణ్‌ క్యాడర్‌కు నేర్పిన బుద్ది ఇదేనా? మేం పదేళ్లుగా కుప్పంలో రాజకీయాలే చేశాం. ఎవరి వ్యక్తిగత విషయాలు, ఆడవాళ్ల గురించి మాట్లాడలేదు. మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకు నిజాయితీతో కూడిన రాజకీయాలు నేర్పారు. ఆయన బాటలో నడుస్తాం. ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం. దాడులు చేస్తే పిరికిపందల్లా పారిపోయే మనస్తత్వం నాది కాదు. అంతిమంగా కుప్పం ప్రజల సంక్షేమమే మా లక్ష్యం’ అని ఎమ్మెల్సీ భరత్‌ చెప్పారు.

డీఎస్పీకి ఫిర్యాదు

తన ఇంటిపై దాడి చేసి, తన తల్లిని దూషించిన టీడీపీ కూటమి నేతలను శిక్షించాలని కోరుతూ ఎమ్మెల్సీ భరత్‌ మంగళవారం డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు హెచ్‌ఎం మురుగేష్‌, బుల్లెట్‌ దండపాణి, రామకృష్ణ, బాబురెడ్డి, చంద్రారెడ్డి, చెంగప్ప, కృష్ణమూర్తి, మునిరాజు, మోహన్‌రామ్‌, కె.మూర్తి, జీవీఆర్‌, పీఏ నారాయణరెడ్డి, అయ్యవారప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement