– 8లో
యువకుడి మృతిలో మిస్టరీ వీడలేదు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు.
విజ్ఞాన నిధిగా
జిల్లా సైన్స్ మ్యూజియం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సైన్స్ మ్యూజియంను విజ్ఞాన నిధిగా తీర్చిదిద్దాలని డీఈవో లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం చిత్తూరులోని సైన్స్ మ్యూజియాన్ని తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంలో జిల్లా సైన్స్ మ్యూజియం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సైన్స్ నమూనాల ప్రదర్శన, గదుల అలంకరణతో పాటు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినూత్న ప్రదర్శనలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఈ మ్యూజియం విద్యార్థులు ఉపాధ్యాయులకు విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అందించే ఒక ఆదర్శ ప్రయోగశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా సైన్స్ అధికారి మోహన్‌సింగ్ మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, భవిష్యత్ కార్యాచరణను డీఈవోకు వివరించారు. క్యూరేటర్ జయంతి మ్యూజియంలోని వివిధ ప్రదర్శనలు, వాటి ప్రాముఖ్యత, ప్రత్యేకతలను వివరించారు.


