మాతాశిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం మాతా, శిశు మరణాలకు గల కారణాలు, వాటి నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రక్తహీనత (ఎనీమియా), అధిక బీపీ, షుగర్‌ వంటి ఆరోగ్య సమ స్యలు ఉన్న హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించాలన్నారు. ప్రసవం వరకు వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలోనే గర్భిణులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్‌ పరీక్షలు చేయాలన్నారు. వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో రవాణా ఇబ్బందులు లేకుండా సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌వో నాగశశిభూషన్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement