లోకల్‌ మార్కెట్లకు వ్యాపారులు | - | Sakshi
Sakshi News home page

లోకల్‌ మార్కెట్లకు వ్యాపారులు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో పలమనేరు, వీకోట, ఏడోమైలులో టమాట మార్కెట్లు ఉన్నాయి. ఈ సీజన్‌ ప్రారంభానికి ఇక్కడి మార్కెట్లకు వంద లోడ్లు టమాట కాయలు రావాల్సి ఉండగా ఇప్పుడు 60 లోడ్లు మాత్రమే వస్తున్నాయి. స్థానికంగానూ సీజన్‌ ముగుస్తున్న దశలో ఉంది. గతంలో ఆలస్యంగా నాటిన తోటలు ఇప్పుడు కాపుకొచ్చాయి. ఇక అనంతపురం జిల్లాలోనూ సరుకు తగ్గింది. దీంతో బయటి రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి మార్కెట్లకు వస్తున్నారు. కావాల్సినంత సరుకు సరఫరా లేకపోవడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరుగుదలకు కారణమైంది. ఇక్కడి టమాటాలకు ధరలు రావాలంటే బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈ, సౌత్‌ ఆఫ్రికా దేశాలకు టమాట ఎగుమతులు పెరగాలి. అప్పుడే మరింతగా ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో పొరుగునే ఉన్న కోలారు మార్కెట్‌లో క్వాలిటీ టమాట బాక్సు రూ.450 పలకడం గమనార్హం. ఏది ఏమైనా మంగళవారం పలికిన ధరలు నిలకడగా ఉంటే నష్టాల నుంచి గట్టెక్క వచ్చిని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement