యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

పలమనేరు: గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన శంకర కుమారుడు యుగంధర్‌(24) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో కూరగాయల వ్యాపారి వద్ద పనిచేసేవాడు. మదనపల్లి సమీపంలోని కొండమీదపల్లికి చెందిన ఒక యువతి, యుగంధర్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఈ మధ్య యువతి అతన్ని దూరం పెట్టింది. వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు, కాల్స్‌ చేసినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నట్టు తెలిసింది. గంగవరం పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును విచారిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు సహా

25 మందిపై అక్రమ కేసులు

పూతలపట్టు(యాదమరి): డీఎస్సీలో అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ప్రజాపోరాటాన్ని చూసి ప్రభుత్వం వణికిపోతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో నిరుద్యోగుల పక్షాన నిలిచి సోమవారం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీపై పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించింది. ర్యాలీకి అనుమతి లేదనే సాకుతో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సునీల్‌కుమార్‌, లలితకుమారితో పాటు ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు సహా మొత్తం 25 మందిపైలు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేసులు పెడతారా అంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లారీని ఢీకొన్న ఐచర్‌ వాహనం

పలమనేరు: పట్టణ సమీపంలోని జగమర్ల క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఐచర్‌ వాహనం ఢీకొంది. దీంతో ఐచర్‌ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అతన్ని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేలో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల

ఏర్పాట్లపై సమీక్ష

కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈఓ పెంచల కిషోర్‌ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్నదానం, కౌంటర్ల నిర్వహణ, లడ్డూ పోటులో ప్రసాదాల తయారీ వేగం పెంపు, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ఆర్జిత సేవల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఉత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మణినాయుడు, డీఈఓ సాగర్‌ బాబు, ఏఈలు, పలువురు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రసూతి, శిశు మరణాలను తగ్గించి గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం కొత్తగా తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌తో కలి సి తల్లీబిడ్డ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 11 వాహనాల్లో చిత్తూరు నియో జకవర్గానికి ఆరు వాహనాలు వచ్చాయని తెలిపారు. గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ప్రసవం అనంతరం ఇంటికి ఉచితంగా చేర్చే సేవలను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చూడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ మేయర్‌ ఆముద, డీఎంహెచ్‌వో నాగభూషణ్‌ రెడ్డి, డీసీసిహెచ్‌ఎస్‌ పద్మాంజలి దేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement