టమాట ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

టమాట ధరలకు రెక్కలు

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

● పలమనేరులో బాక్సు ధర రూ.350 ● సరుకు తగ్గినప్పుడు పెరుగుతున్న ధర ● తెగుళ్లతో తగ్గిన పంట దిగుబడి

పలమనేరు: టమాట ధరలు పెరిగాయి. పలమనేరు మార్కెట్‌లో మంగళవారం బాక్సు ధర రూ.350 పలికింది. పంటలకు తెగుళ్లు సోకడం, దిగుబడి తగ్గడంతోనే ధరలు పెరిగినట్టు మండీ వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో టమాట ధరలు ఇన్నాళ్లు తగ్గుముఖం పట్టాయి. కోత కూలీలు, రవాణా చార్జీలు కూడా అందడం లేదని చాలామంది రైతులు కాయలను తోటల్లోనే వదిలేశారు. మరికొందరు తోటల నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపకుండా వదిలేశారు. దీంతో తోటలకు వైరస్‌ తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. అందువల్లే డిమాండ్‌ పెరిగి ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు.

టమాట పంట సాగు వివరాలు

టమాట సాధారణ సాగు 5 వేల హెక్టార్లు

ప్రస్తుతం సాగైన పంట 2 వేల హెక్టార్లు

కోతదశలో ఉన్న తోటలు 880 హెక్టార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement