చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని మెసానిక్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్ షిప్ కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు రెండో రోజు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణలో కొనసాగాయి. కబడ్డీ, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, చెస్ తదితర పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 498 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ కోర్టులో క్రీడాకారులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పాయింట్ల కోసం తలపడ్డారు. బాస్కెట్‌ను టార్గెట్ చేస్తూ క్రీడాకారులు ప్రదర్శించిన సమన్వయం, వేగం వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఆర్చరీ విభాగంలో క్రీడాకారులు పూర్తి ఏకాగ్రతతో లక్ష్యం వైపు బాణాలు గురిపెట్టి సత్తా చాటారు. చదరంగం బోర్డులపై క్రీడాకారులు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ చతురతతో కూ డిన ఎత్తుగడలతో ముందుకు సాగారు. ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ పర్యవేక్షించారు. పలువురు పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
బాస్కెట్ వైపు దూసుకెళ్తూ..
లక్ష్యమే ధ్యేయంగా ఆర్చరీలో గురి


