చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ కచ్చితంగా ఐగాట్ కర్మయోగి కోర్సు లు పూర్తి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించేందుకు ఐగాట్ కర్మయోగి శిక్షణా కోర్సులు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని ఉద్యోగులందరూ కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 19,970 మంది ఉద్యోగులు పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వారిలో 13,940 మంది యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. 6,029 మంది ఇప్ప టి వరకు ఒక్కసారి కూడా లాగిన్ కాకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 2,423 మంది, పాఠశాల విద్యాశాఖలో 1,620 మంది, ప్రజారవాణా శాఖలో 959 మంది, రెవెన్యూ శాఖలో 645 మంది ఉద్యోగులు జీరో లాగిన్‌లో ఉన్నారని తెలిపారు. వారి ని పోర్టల్‌లో యాక్టివేట్ చేయించాలని అధికారుల ను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నెలకు కనీసం మూడు శిక్షణా కోర్సులను పూర్తి చేయాల ని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే ఒకటి లేదా రెండు కోర్సులు పూర్తి చేసిన 1,640 మంది ఉద్యోగులు మూడో కోర్సును పూర్తి చేస్తే జిల్లా నిర్దేశిత లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకుంటుందని తెలిపారు. ప్రతి శుక్ర వారం ఐగాట్ కర్మయోగి పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామ ని తెలిపారు. నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణతో జిల్లా స్థానాన్ని మెరుగుపరిచి, రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ర్యాంకును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.


