కోత పడింది సర్‌ | - | Sakshi
Sakshi News home page

కోత పడింది సర్‌

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

ముగిసిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ 31న ముసాయిదా ప్రచురణ అక్టోబర్‌ 3న తుది జాబితా

జిల్లాలో 1.36 లక్షల ఓట్లు ఔట్‌

తేలిన మృతులు, వలసలు

జిల్లాలో 42,337 మంది మరణించినా ఇంకా జాబితాలోనే కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఉపాధి, ఇతర కారణాలతో 55,773 మంది ఊరు వదిలి శాశ్వతంగా వలస వెళ్లినట్లు తేల్చారు. రెండు చోట్ల ఓటును 19,301 మంది నమోదు చేసుకున్నారని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు డోర్‌ నంబర్లలో 18,622 మంది ఓటర్లు లేరని గుర్తించారు. మరణించిన ఓటర్ల సంఖ్యలో పలమనేరు అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 8,870 మంది చనిపోయినట్లు బీఎల్‌ఓలు గుర్తించారు. అన్‌కలెక్టబుల్‌లో అత్యధికంగా పలమనేరు – 29,381 అత్యధికంగా, అత్యల్పంగా గంగాధరనెల్లూరు– 14,624 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. జిల్లాలో లక్షల ఓట్లకు కత్తెర పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ఎన్యూమరేషన్‌ ఫారాల ఆన్‌లైన్‌ చేసే గడువు పూర్తయింది. ఈ క్రమంలో సుమారు 1.36లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ముసాయిదా సైతం విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు అంశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల సంఘం ఆదేశాలతో జూన్‌ 15వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ఈ నెల 24తో పూర్తయింది. ఈ క్రమంలో ప్రస్తుత జాబితాలోని మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండేసి ఓట్లున్న వారిని ప్రధానంగా గుర్తించారు. క్షేత్రస్థాయిలో రెండు, మూడుసార్లు పునఃపరిశీలన చేసిన తర్వాత అన్‌కలెక్టబుల్‌ డేటా (ఆచూకీ లేనివారు) కింద జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 1,36,059 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరంతా దాదాపుగా అనర్హులుగానే అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నెల 31వ తేదీన అన్ని జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా ప్రదర్శించనున్నారు. జాబితా ప్రచురణకు ఓటర్లు, రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

వీరంతా ఇతరులే..

2002 జాబితాతో మ్యాపింగ్‌ కాని వారు జిల్లాలో 23,881 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలి తం లేకపోయింది. పాత జాబితాలో లేకపోవడం, శాశ్వతంగా వలస వెళ్లడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, 2002లో ఓటు ఎక్కడ నమోదైందో తెలపకపోవడం తదితర అంశాలు బీఎల్‌ఓలకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఎన్యూమరేషన్‌న్‌ పత్రా లు తీసుకున్నా సంతకం చేయకపోవడం, ఫారం తిరిగి ఇవ్వకపోవడం అటువంటి వారిని ఇతరుల కింద నమోదు చేశారు.

మ్యాపింగ్‌ కాని వారికి నోటీసులు

జిల్లాలో మొత్తంగా 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. 2002 నాటి వివరాలు లేకుండా పత్రాలు ఇచ్చిన వారికి ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. వీరంతా సరైన పత్రాలు చూపి మ్యాపింగ్‌ చేసుకోకపోతే.. అక్టోబర్‌ 3వ తేదీన విడుదల చేయనున్న తుది జాబితాలో వీరి ఓటును తొలగించనున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉండటం నిబంధనలకు విరుద్ధం. దీంతో ఎక్కడ ఓటు హక్కు కొనసాగించాలన్నది సదరు వ్యక్తుల నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు.

ప్రక్షాళన దిశగా..

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చేపట్టిన సమగ్ర ఓటర్ల సవరణ(సర్‌) కీలక ఘట్టానికి చేరుకుంది. బోగస్‌ ఓట్లకు కళ్లెం వేసి, పారదర్శక జాబితా తయారీయే లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం ఎన్యూమరేషనన్‌ పత్రాలను డిజిటైజేషన్‌ చేసింది. ఈ ప్రక్రియ ముగియడంతో ముసాయిదా జాబితా ప్రచురణకు అధికారులు పకడ్బందీగా కసరత్తు చేపడతున్నారు.

జిల్లా సమాచారం

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్యూమరేషన్‌ ఫారాలు ఆన్‌లైన్‌ చేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ఈ నెల 24వ తేదీతో ముగిసింది. ఈ ప్రక్రియలో బీఎల్వోలు క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 13,40,126 మంది ఓటర్లలో ఏకంగా 1.36 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నాటికి తొలగించనున్నారు. ఈ తొలగింపు అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై సాక్షి ప్రత్యేక కథనం.

నియోజకవర్గం తొలగించనున్న ఓట్లు నో మ్యాపింగ్‌వి తప్పులు దొర్లినవి

నగరి 20,879 3,9138,470

జీడీ నెల్లూరు 14,6244,2349,886

చిత్తూరు 26,4365,74719,528

పూతలపట్టు 20,3215,065 21,304

పలమనేరు 29,381 2,28626,353

కుప్పం 24,4182,63624,664

మొత్తం 1,36,059 23,881 1,10,205

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement