పుత్తూరు: మా బిడ్డ ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా మా ఇంటి దైవమని ఆ కుటుంబం చెమ్మగిల్లిన కళ్లతో తెలిపింది. పుత్తూరు మండలం మజ్జిగగుంట కాలనీకి చెందిన శివ కుమారుడు గౌతమ్(8) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా మాజీ మంత్రి రోజా తన సొంత ఖర్చులతో కార్పొరేట్ వైద్యం అందించారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు ఆదివారం నగరిలోని రోజా ఇంటికి వచ్చారు. రోజాను గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. రోజమ్మ సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌ను రోజా అక్కున చేర్చుకుని దీవించారు.


