నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు వినతులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖ ల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.

చేనేత రంగానికి

కోటయ్య సేవలు ఎనలేనివి

చిత్తూరు కలెక్టరేట్‌ : చేనేత రంగం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రగడ కోటయ్య చేసిన సేవలు ఎనలేనివని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అసి స్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ చేనేత ఉద్యమ నాయకుడిగా ప్రగడ కోటయ్య దేశానికి, రాష్ట్రా నికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. 1942లో మద్రాస్‌, ఆంధ్రా స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారని గుర్తుచేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాలుగుసార్లు సత్యాగ్రహ ఉద్యమాలు చేపట్టిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా చట్టసభల్లో చేనేత వర్గాల గళాన్ని వినిపించా రని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 200లకు పైగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేశారని చెప్పారు.

30న ప్రసన్న వేంకటేశ్వరుడి పుష్పయాగం

– 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌/పుత్తూరు : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోత్సవాల్లో తెలిసీ, తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీ సాయంత్రం మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. 30వ తేదీ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీటితో విశేష అభిషేకం చేపడతారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

నేడు కాణిపాకంలో

108 మందితో వీణ నాదార్చన

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆలయ కల్యాణ వేదిక వద్ద సోమవారం వీణ నాదార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 108 మంది కళాకారులతో విశేష వీణ నాదార్చన ఉంటుందన్నారు. విజయవాడకు చెందిన సంకీర్తన సేవా బృందం ఈ సాంస్కృతిక సేవను నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వామివారి క్షేత్రంలో తొలిసారిగా జరు గుతున్న ఈ నాదార్చనను వీక్షించేందుకు భక్తు లు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఈవో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement