కార్వేటినగరం: కార్వేటినగరంలో వెలసిన ద్రౌపది సమేత ధర్మరాజులస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అగ్నిగుండం ప్రవేశం చేపట్టారు. ఉద యం అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు పొంగళ్లు పెట్టారు. సాయంత్రం కంకణాలు ధరించిన భక్తులు కుమారగిరి సమీపంలో ఉన్న స్కంధ పుష్కరిణిలో స్నానమాచరించి పసుపు వస్త్రాలు ధరించి అమ్మవారితోపాటు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు, తమి నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ఆవరణం కిటకిటలాడింది. అగ్నిగుండ ప్రవేశానికి బలిజ కులస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రవియాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రాజు, ఉపాధ్యక్షుడు కట్లరవిరెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి, ఉప కోశాధికారి సాయి రాయల్, అర్చకులు సుమన్‌యాదవ్, బాబు ఆచారి, కుమార ఆచారి పాల్గొన్నారు.


