ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికే తీరనిలోటు చంద్రబాబు పాలనలో రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం
తిరుపతి మంగళం : మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనా భం ఒక సామాజిక వర్గానికే కాకుండా సమాజానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పాడెను తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మోశారని, దానిపైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఉప ము ఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో ఏం చేసినా వక్రీకరించడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు.
కాపు సంక్షేమంలో చెరగని ‘ముద్ర’
అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాడే ఏకై క నాయకుడు జగనన్న అని అన్నారు. ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికే తీరని లోటు అన్నారు. తన ఆస్తులను సైతం అమ్ముకుని ప్రజల సంక్షేమమే పరమావధిగా, కాపులను బీసీలో చేర్చాలన్న లక్ష్యంతో నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టి ఎన్ని అక్రమ కేసులు బనాయించిందో అందరికీ తెలుసునన్నారు.
వైఎస్ జగన్ ఏం చేసినా వక్రీకరించడమే చంద్రబాబు నైజం
మాదిగలను మోసం చేస్తున్న బాబు
సాయికృష్ణను అత్యంత దారుణంగా లాకప్‌డెత్ చేస్తే చంద్రబాబు కానీ, పవన్‌కళ్యాణ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమన్నారు. రెండేళ్ల పాలనలో కాపులకు పవన్‌కళ్యాణ్ చేసిందేమీలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు విభజించారని, కూటమి పాలనలో తొమ్మిది మంది మాదిగలు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మందకృష్ణ మాదిగను అడ్డంపెట్టుకుని చంద్రబాబు మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కనీసం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాలు చేపడుతున్నారంటే ఈ ప్రభుత్వ తీరు ఏవిధంగా ఉందో అందరికీ అర్థమవుతోందన్నారు.


