బంగారుపాళెం : అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యో గి గురువారం కరంటు షాక్‌తో మృతి చెందా డు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఎగువరాగిమానుపెంటకు చెందిన లెక్క ల రవి కుమారుడు చైతన్య(32) అమరరాజా ఫ్యాక్టరీ టీబీడీ విభాగంలో మెయింటైనర్‌గా నుంచి పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం 4.30 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. అక్కడ విద్యుత్ షాక్ కొట్టింది. చాతీపై తీవ్రగాయాలయ్యాయి. సహచర ఉద్యోగులు అతన్ని చిత్తూ రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ ఫ్యాక్టరీ బంగారుపాళెం పరిధిలో ఉండడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యు లు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని భార్య కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
ఇనుప కంచెలో ఇరుక్కుని చుక్కల దుప్పి మృతి
కార్వేటినగరం: మండలంలోని చింతతోపు సమీపంలోని శివాలయం వద్ద గురువారం మామడి తోటలో ఇనుప కంచెలో ఇరుక్కుని చుక్కల దుప్పి మృతి చెందింది. అటవీశాఖ అధికారి వెంకట సుబ్బయ్య కథనం మేరకు.. మగ చుక్కల దుప్పి వీఎం పురం బీటు పరిధిలోని చింతతోపు ఎస్టీ కా లనీ సమీపంలోని మామిడి తోటలోకి వచ్చింది. ఇనుప కంచెను దాటే క్రమంలో అందులో ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకుని దుప్పిని ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు. పశు వైద్యాఽధికారి డాక్టర్ హేమకుమార్ చికిత్స చేశారు. అనంతరం కుప్పా నిగుంట అటవీ ప్రాంతంలో విడిచి పెట్టేందుకు తీసుకెళ్లారు. అక్కడ అది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారుల ఆదేశాల మే రకు పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఓ లోకేష్, ఎఫ్‌బీఓ వినోద్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
మిట్స్ ప్రొఫెసర్‌కు అరుదైన గుర్తింపు
కురబలకోట: మదనపల్లి సమీపంలోని అంగళ్లు లో ఉన్న మిట్స్ డీమ్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలుమిని రిలేషన్స్ ఆఫీసర్ గుత్తి నాగశ్వేత ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈ సీనియర్ మెంబర్ గ్రేడ్ సాధించినట్లు వీసీ యువరాజ్ గురువారం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఐఈఈఈ సీనియర్ మెంబర్ హోదా సాధించడం అరుదైన విషయమన్నారు. ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో పదేళ్లకు పైగా విశిష్టమైన వృత్తిపరమైన అనుభవం, పరిశోధనల్లో చేసిన కృషి, సాంకేతిక సేవలు, నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన నైపుణ్యాలను గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. గుత్తి నాగశ్వేత అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించడమే కాకుండా విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నా రని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై మిట్స్ ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ అరుదైన గౌరవం యూనివర్సిటీ విద్యా పరిశోధనా నాణ్య తకు నిదర్శనమని చాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ప్రశంసించారు. ప్రొ చాన్సలర్ నాదేళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్‌కుమార్, ఐఈ ఈఈ కోఆర్డినేటర్ సి.కుమార్, అధ్యాపకులు, సిబ్బంది నాగశ్వేతను అభినందించారు.
మహిళలకు
ఉచితంగా టైలరింగ్ శిక్షణ
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 23వ తేదీ నుంచి 31 రోజులు మహిళలకు టైలరింగ్‌పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు అర్హులని తెలిపారు. కనీస విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు, టూల్‌కిట్టును ఇవ్వనున్న ట్లు పేర్కొన్నారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు.


