టెన్త్‌ టాపర్లకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ టాపర్లకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

● ఈ నెల 20న చిత్తూరులో కార్యక్రమం ● మండలం నుంచి ఆరుగురి ఎంపిక

● ఈ నెల 20న చిత్తూరులో కార్యక్రమం ● మండలం నుంచి ఆరుగురి ఎంపిక

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా గత విద్యాసంవత్సరం పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్‌ స్టార్‌ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్‌ విద్యార్థులను సత్కరించనున్నారు. నిబంధనల ప్రకా రం జిల్లాలోని ప్రతి మండలంలోనూ అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి జిల్లాలో అదనంగా ముగ్గురు ప్రత్యేక అవసరాలు గల మెరిట్‌ విద్యార్థులను సైతం పురస్కారానికి ఎంపిక చేస్తారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక మెడల్‌, అభినందన పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేసి సత్కరిస్తారు.

24న మెగా పీటీఎం 3.1

చిత్తూరు కలెక్టరేట్‌ : ఈ నెల 24న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎం 3.1 కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

పీహెచ్‌సీల తనిఖీ

ఐరాల: పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మెంబర్‌ దేవేంద్రకుమార్‌ ఆదేశించారు. ఆయ న గురువారం కాణిపాకం పీహెచ్‌సీని సందర్శించారు. రికార్డులు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఈ సంజీవిని, ల్యాబ్‌ టెస్టులు, పరిసరాల పరిశుభ్రతపై తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారి స్వాతిసింధూరను ఆదేశించారు. అదేవిధంగా ముదిగోళం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను సందర్శించి, వివిధ జాతీయ వైద్య కార్యక్రమాల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. డీపీఎంఓ డాక్టర్‌ ప్రవీణ, డాక్టర్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూౖ లెన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 82,255 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు లభించాయి. టైంస్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement