కలెక్టర్ సారూ... న్యాయం జరగడం లేదు
పీజీఆర్‌ఎస్‌లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ
కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : శ్రీకలెక్టర్ సారూ....క్షేత్ర స్థాయి లో న్యాయం జరగడం లేదుశ్రీ అంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మాట్లాడు తూ ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే అర్జీల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి
తమ గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని గంగాధరనెల్లూరు మండలం, చెర్లోపల్లి, బంగారెడ్డిపల్లి, తాటిమాకులపల్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఆయా గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. మహిళలు మాట్లాడుతూ చెర్లోపల్లి గ్రామంలోని దండుమారియమ్మ ఆలయం పక్కన ఓ నివాసంలో మహిళ వ్యభిచారం చేయిస్తోందని, ఆలయం పక్కన నివాసంలో జరుగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన సర్పంచ్ పై దాడి చేయించారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పొలం దారిని ఆక్రమించారు
పొలం దారిని ఆక్రమించారని పలమనేరు మండలం, జంగాలపల్లె గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ పొలానికి దారిగా ఉన్న భూమిని ఆక్రమించడంతో రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నారు.
కలెక్టర్ సారూ... న్యాయం జరగడం లేదు
కలెక్టర్ సారూ... న్యాయం జరగడం లేదు


