కీచక తండ్రి అరెస్ట్
పలమనేరు: కుమార్తైపె లైంగికదాడి చేసిన తండ్రిని పోలీసులు సోమవారం పలమనేరులో అరెస్ట్ చూపారు. నిందితుడిని పోలీసు స్టేషన్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ రిమాండ్‌కు తరలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 2న పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడ్డాడన్నారు. దీనిపై బాలిక నానమ్మ ఫిర్యా దుతో పెద్దపంజాణి పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా ముద్దాయిని పలమనేరు–రాయల పేట రోడ్డులోని గుత్తివారిపల్లి వద్ద సోమవారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆపై నిందితుడ్ని పలమనేరు పట్టణంలో రోడ్లపై నడిపించుకుంటూ రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. ఇలాంటి కీచక కామాంధులను వదిలిపెట్టే ప్రస క్తే లేదన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన వారిలో సీఐ పరశురాముడు, సిబ్బంది ఉన్నట్టు తెలిపారు.


