
సార్ చెబుతుంటే.. మేడమ్ వింటున్నారు..
ఖరీఫ్ విత్తు సమయం ఆసన్నమైంది.. హలం పట్టి పొలం దున్ని సాగుకు సన్నద్ధమయ్యాడు పుడమి పుత్రుడు. రాయితీ విత్తు కోసం ఎదురు చూస్తున్నాడు. కూటమి సర్కారు రాయితీ విత్తనం అరకొరగా కేటాయించింది. ఆ విత్తుపై కూటమి నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. అర్హుడైన కర్షకుడికి కాయలు అందేనా?.. విత్తనం కోసం అన్నదాత విలపించాల్సిదేనా?.. సాగు సాగేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
జిల్లాకు అరకొరగా వేరుశనగ విత్తన కేటాయింపు
● ఆ విత్తనానికీ కూటమి నేతల పోటీ ● ముందస్తుగా ఆర్డర్లు ● నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ● అర్హులైన రైతులకు కాయలు కష్టమే ● వేరుశనగ సాగు కష్టమే
● సీఎం ముందు విలపించిన ఓ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
గర్భిణుల సేవలపై నిర్లక్ష్యం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గర్భిణులకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాతా శిశు మరణాలను కట్టడి చేసేందుకు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలన్నారు. గర్భిణుల సేవల్లో నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సుఖ ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరగాలన్నారు. హైరిస్క్ కేసులను జిల్లా ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్యులు ప్రవీణ, అనూష, అనిల్‌కుమార్, గిరి, వేణుగోపాల్, శ్రీవాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డులకు
దరఖాస్తు చేసుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కొత్త రేషన్‌కార్డులకు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని డీఎస్‌ఓ శంకరన్ తెలిపారు. కొత్తకార్డుల దరఖాస్తుతోపాటు కార్డుల విభజన, సభ్యులు చేరిక, చిరునామా మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చన్నారు. వెబ్‌సైట్‌లో కూడా కార్డులు దరఖాస్తు, జారీకి బుధవారం నుంచి అవకాశం కల్పించవచ్చన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. కాగా ఇప్పటి వరకు కొత్త రేషన్‌కార్డుల కోసం సుమారు 20 వేల వరకు దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇదివరకు ఈకేవైసీ చేయించుకున్న వాళ్లు కార్డు విభజన చేసుకోవాలంటే ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కార్డులు మంజూరు, నిబంధనలు, ఇతరాత్ర విషయాలపై అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఆన్‌లైన్‌లో పొందుపరిచే నిబంధనల ప్రకారమే కార్డులు జారీ ఉండవచ్చని వారు భావిస్తున్నారు. కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకోనుందని అంటున్నారు.
పెద్దపంజాణి ‘గీత’ మద్యం షాపునకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు అర్బన్: కల్లు గీత సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వు చేసిన పెద్దపంజాణిలో మద్యం దుకాణం ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ (ఈఎస్) శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మద్యం దుకాణం లైసెస్స్ కోసం మంగళవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 50 శాతం రాయితీతో కల్లుగీత సామాజికవర్గానికి మద్యం దుకాణం కేటాయిస్తామని, ఇందు కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణాన్ని కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు చిత్తూరు నగరంలోని మిట్టూరులో ఉన్న ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఈఎస్ కార్యాలయం, పుంగనూరులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
కాణిపాకం: జిల్లాకు ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను అరకొరగా కేటాయించింది. ఈ విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ సందిగ్ధంలో పడింది. దీనికి తోడు కూటమి నేతలు విత్తన కాయల కోసం పోటీపడుతున్నారు. ముందస్తుగా విత్తన కాయల కోసం ఆర్డర్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల అధికారులు సైతం వారి సిఫార్సులకు తలొగ్గారు. జిల్లాలోని రైతులు ఖరీఫ్ సీజన్‌లో వర్షాధారంగా సాగు చేసే పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. జిల్లా వ్యాప్తంగా 1.80 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 90 వేల మంది రైతులు ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాగు చేస్తారు.
తలొగ్గిన అధికారులు
కూటమినేతలు, కార్యకర్తల సిఫార్సులకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది చాలా మంది తలొగ్గారు. నేతల డిమాండ్ మేరకు కాయలను నేరుగా ప్రైవేటు భవనాలకు మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారు. కానీ పక్షంలో కాయల కోసం వచ్చే రైతుల పేరిట రెండు, మూడు బ్యాగులకు టోకన్లు వేసి నేతలకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. జీడీ నెల్లూరు, చిత్తూరు, ఎస్‌ఆర్ పురం, పలమనేరు, కుప్పం, వి.కోట, శాంతిపురం, బంగారుపాళెం, పూతలపట్టు, నగరి, గుడిపాల తదితర మండలాల్లో చేయడానికి ప్రయత్నాలు అధికంగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ఎంపీడీఓలకు
మండలాలు కేటాయింపు
చిత్తూరు కార్పొరేషన్: డిప్యూటీ ఎంపీడీఓల నుంచి ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందినవారికి మండలాలను కేటాయించారు. ఈ వివరాలను మంగళవారం జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలియజేశారు. ఎర్రావారిపాళెం డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న మాలతిని కేవీబీపురం ఎంపీడీఓగా నియమించారు. నాగలాపురంలో పనిచేస్తున్న వెంకటరత్నమ్మను బీఎన్‌కండ్రిగ ఎంపీడీఓగా, రామకుప్పంలో పనిచేస్తున్న రాధాకృష్ణకు గుడుపల్లె ఎంపీడీఓగా, వెదురుకుప్పంలో పనిచేస్తున్న పురుషోత్తానికి అక్కడే ఎంపీడీఓగా, అనకాపల్లిలో పనిచేస్తున్న శిరీషను గుడిపాల ఎంపీడీఓగా నియమించారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మంగళవారం జిల్లాలోని పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్, సైబర్ ఫోరెన్సిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాలు కొత్త రూపాలు ఎలా దాలుస్తున్నాయి ? నిందితులను ఎలా పట్టుకోవాలి ? సాక్ష్యాల సేకరణపై ఎస్పీ మణికంఠ వివరించారు. నిపుణులను సైతం పిలిపించి సందేహాలను నివృత్తి చేయించారు. ఈ సదస్సులో ఎస్పీ వేదికపై కూర్చుని క్లాస్ చెబుతుంటే.. కింద కూర్చుని విషయాలను ఓ మహిళా అధికారి ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ అధికారిణి హర్షిత తిరుపతి రైల్వే (జీఆర్‌పీ) డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే ఈమె ఎస్పీ సతీమణి కావడం గమనార్హం. ఇలా ఒకే వేదికలో ఎస్పీ దంపతులు వేర్వేరు హోదాల్లో సెమినార్‌కు హాజరుకావడం విశేషం.
న్యూస్‌రీల్
విత్తనకాయల కోత
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్‌లో 71,305 హెక్టార్లల్లో 22 రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఇందులో 35,238 హెక్టార్లలో వేరుశనగ సాగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ మేరకు తొలుత 40,338 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం 26,350 క్వింటాళ్ల కాయలను మాత్రమే కేటాయించింది. కేటాయించిన విత్తనకాయలు సరిపోవని, 13,988 క్వింటాళ్ల విత్తనాలు ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ఇవి వస్తాయా? లేదా అనే అనుమానం ఉంది. ఇప్పటికే కేటాయించిన కాయలను పంపిణీ చేస్తే ఒక్కొక్క రైతుకు ఒక బ్యాగు చొప్పున్న 88 వేల మందికి ఇవ్వవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. వేరుశనగ రాయితీ ధరను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.
అవసరం మేరకు కాయలు ఇవ్వాలి
వేరుశనగ సాగు చేసే రైతులకు అవసరమైన మేరకు కాయలు ఇవ్వాలి. సిఫార్సులు లేకుండా అర్హులైన రైతులకు కాయలు అందేలా చూడాలి. 26,350 క్వింటాళ్ల కాయలు వస్తే జిల్లాకు సరిపోవు. కచ్చితంగా 40 వేల క్వింటాళ్ల కాయలు అవసరం ఉంది. అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దు. ముందుస్తుగానే కాయలు పూర్తి స్థాయిలో తెప్పించుకుని ఇచ్చేలా చూడాలి. –ఆర్ వెంకటరెడ్డి,
రైతు నాయకుడు, జీడీ నెల్లూరు
కూటమి నేతల వల
అప్పుడే క్షేత్రస్థాయిలో వేరుశనగ విత్తనాల కోసం కూటమి నేతల వద్దకు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. అధిక మొత్తంలో కొల్లగొట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మండల నేతలు ఒక్కొక్కరూ 50 నుంచి 100 బ్యాగులు ఆశిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు 10 నుంచి 50 బ్యాగులు కావాలని హుక్కుం జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాము పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణికి దిగుతున్నారని పలువురు అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.

సార్ చెబుతుంటే.. మేడమ్ వింటున్నారు..

సార్ చెబుతుంటే.. మేడమ్ వింటున్నారు..

సార్ చెబుతుంటే.. మేడమ్ వింటున్నారు..