కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న! | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!

May 6 2025 1:40 AM | Updated on May 6 2025 1:40 AM

కలెక్

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!

చిత్తూరు కలెక్టరేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నాయి. బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడానికి రూ.కోట్లు వెచ్చించి, మరుగుదొడ్లను నిర్మించేలా చర్యలు చేపడుతోంది. అయితే కొంతమంది అధికారులు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ప్రాంగణంలో విద్యాశాఖతోపాటు సమగ్రశిక్ష శాఖ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో దాదాపు 25 మంది మహిళా ఉద్యోగులు, 35 మంది పురుషులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు పలు పనుల నిమిత్తం నిత్యం విద్యాశాఖ కార్యాలయానికి విచ్చేస్తుంటారు. జిల్లా విద్యాశాఖ ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లు పాడైపోయి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ముఖ్య శాఖల్లో ఒకటైన విద్యాశాఖలో మరుగుదొడ్లు ఉన్నా..లేనట్టే అయ్యింది. దీంతో ఉద్యోగులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహిళా ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం

విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు మరుగుదొడ్లు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి సమస్యను ఎవరితో చెప్పుకోలేక ఇటీవల డీఈఓ దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డీఈఓ వరలక్ష్మి మరుగుదొడ్ల మరమ్మతుల సమస్యను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్‌ మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.5.35 లక్షలను కలెక్టర్‌ ఫండ్స్‌ నుంచి వెంటనే విడుదల చేశారు.

అడ్వాన్స్‌ ఇస్తేనే పనులు మొదలు

మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

ఇంకా ప్రారంభం కాని పనులు

ఇక ఏడు రోజులే గడువు

అది సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయం.. స్వచ్ఛతకు పుష్కలంగా నిధులున్నాయ్‌.. మే 15లోపు మరుగుదొడ్ల మరమ్మతు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు.. అయినా అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత.. వెరసి ఆ కార్యాలయంలోని మహిళా ఉద్యోగినులు ఉదయం ఇంట్లో బయలు దేరే ముందు.. ఇంటి కెళ్లిన తరువాతే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఒక వేళ అత్యవసరమైనా అవస్థ పడాల్సిందే. కలెక్టర్‌ ఆదేశాలే మరుగున పడిపోతున్నాయని ఉద్యోగుల ఆవేదన. ఇదీ సర్వశిక్ష శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల వ్యవహరశైలి.

విద్యాశాఖ కార్యాలయంలోని మరుగుదొడ్ల పనులను ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ సమగ్రశిక్ష శాఖ ఇంజినీరింగ్‌ అధికారులకు ఉత్తర్వుల్లో ఆదేశించారు. నిధులను సైతం సమగ్రశిక్ష శాఖ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. అయితే పనులు మొదలు పెట్టాల్సిన ఇంజినీరింగ్‌ విభాగం సైట్‌ ఇంజినీర్‌ మునిరత్నం ముందుగా అడ్వాన్స్‌ ఇస్తేనే పనులు మొదలుపెడతానంటూ అలసత్వం వహిస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో మరుగుదొడ్ల పనులకు ఇసుక, కంకరను తోలించి మిన్నకుండిపోయారు. కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం ఆ మరుగుదొడ్ల పనులను పూర్తి చేసేందుకు ఇక పది రోజులే గడువు ఉంది. ఆ లోపు పనులు పూర్తి చేస్తారా? కలెక్టర్‌ ఉత్తర్వులను దిక్కరిస్తారా? అని విద్యాశాఖ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!1
1/2

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!2
2/2

కలెక్టర్‌ ఆదేశాలు‘మరుగు’న!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement