సీహెచ్‌ఓల సమ్మెట | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌ఓల సమ్మెట

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

సీహెచ

సీహెచ్‌ఓల సమ్మెట

జిల్లా వివరాలు పీహెచ్‌సీలు: 50 విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లు: 464 సీహెచ్‌ఓలు: 451 సమ్మెకు ముందు రోజువారీ ఓపీల సంఖ్య(సుమారు): 9,280
కూటమిపై

వారంతా పల్లెనాడి పట్టే చిరుద్యోగులు.. నిత్యం పల్లెల్లో పేదలకు వైద్యసేవలు అందించడంలో శ్రమిస్తుంటారు. వారిని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పరిష్క రించమని కూటమి సర్కారుకు విన్నవించారు. పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత శాంతియుత పోరాటం చేశారు. అయినా ప్రయోజనం శూన్యం. దీంతో నిరవధిక సమ్మె సైరన్‌ మోగించారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): డిమాండ్ల సాధనకు మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌) నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వెలవెలబోతున్నాయి. వైద్య సేవలు అందక పల్లె ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చికిత్స కోసం పీహెచ్‌సీ, ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులు ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సీహెచ్‌ఓలు రోడ్డెక్కారు. వినూత్నరీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలతో హెరెత్తిస్తున్నారు. వామ పక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. జిల్లాలో 464 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లున్నాయి. ఇందులో 14 రకాల వైద్యపరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేసిన వారిని సీహెచ్‌ఓలుగా నియమించింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సీహెచ్‌ఓలు విశేష సేవలందిస్తున్నారు. అయితే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేవలిలా..

మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, సీహెచ్‌ఓలు పల్లెల్లోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు వచ్చే రోగులకు సాధారణ జబ్బులతోపాటు దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్‌కు సైతం వైద్యపరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. పిల్లలు, గర్భిణులకు పరీక్షలు చేసి, చికిత్స చేసేవారు. రోగికి వచ్చిన వ్యాధిపై ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పీహెచ్‌సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలి మెడిసిన్‌ సెంటర్‌లోని వైద్యులకు ఫోన్‌ చేసి రోగులతో మాట్లాడించి చికిత్స చేయించారు. దీంతో రోగులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే అవసరం తప్పేది. అలాగే విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌కు రాలని రోగులకు ఇంటికెళ్లి పరీక్షలు చేసి, మందులు, మాత్రలు ఇస్తున్నారు. టీకాలు వేయించడంలో ముందుండి పనిచేస్తున్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఎన్‌సీడీ సర్వేలో ఏఎన్‌ఎంలతో సమానంగా సీహెచ్‌ఓలుగా కీలకంగా వ్యవహరించారు. కానీ వీరిని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీంతో వీరు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కారు.

నిరవధిక సమ్మెలోకి...

ఏపీ మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌– కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీహెచ్‌ఓలు గతనెల 16వ తేదీ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఎదుట శాంతి యుతంగా నిరసన చేపట్టారు. 27వ తేదీ జిల్లా అధికారులకు నోటీసులిచ్చి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీంతో 28వ తేదీ నుంచి గ్రామాల్లోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సీహెచ్‌ఓలు వెళ్లడం లేదు. దీంతో పల్లె ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ జబ్బులతో పాటు పిల్లలు, గర్భిణలకు వైద్యం కోసం సూదూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది.

డిమాండ్లు ఇవీ..

● ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి.

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి.

● పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి.

● ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలి.

● క్లినిక్‌ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి.

● నిర్దిష్ణమైన జాబ్‌ చాటర్‌ అందించాలి.

● ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి సీహెచ్‌ఓలను మినహాయించాలి.

● హెచ్‌ఆర్‌ పాలసీ, ఇంక్రీమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు తదితరాలను త్వరిగతగతిన అమలు చేయాలి.

సమ్మెలో సీహెచ్‌ఓలు

జిల్లాలో సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వెలవెల సేవలు అందక పల్లె ప్రజలకు పాట్లు దిగిరాని ప్రభుత్వం

డిమాండ్ల సాధనకే సమ్మె

జీతభత్యాల విషయంలో ఎన్నో స మస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్‌తో సమ్మెకు దిగాం. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఈ నిరసనతో ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 28వతేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. – భానుప్రియ, ఉపాధ్యక్షురాలు,

ఏపీ మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌,

సీహెచ్‌ఎ అసోసియేషన్‌, చిత్తూరు

పీఆర్సీ ఇవ్వాలి

సీహెచ్‌ఓల జీత భత్యా లు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన ఎంఎల్‌ హెచ్‌ఎపీలను రెగ్యులర్‌ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జీఓ నంబర్‌ 64 ప్రకారం ఎన్‌హెచ్‌ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్‌ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్‌ ఇస్తున్నా మాకు మాత్రం ఇవ్వడం లేదు.

– రషీద్‌, సీహెచ్‌ఓ

ఇంక్రిమెంట్లు ఇవ్వాలి

ఎన్‌హెచ్‌ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్‌ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారానికి హామీ ఇవ్వాలి. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. మా డిమాండ్లు పరిష్కరం అయ్యేంత వరకు ఈ నిరవధిక సమ్మె ఆగదు.

– మోహనకుమారి, సభ్యురాలు,

ఏపీ మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌సీహెచ్‌ఎ అసోసియషన్‌, చిత్తూరు

సీహెచ్‌ఓల సమ్మెట 
1
1/4

సీహెచ్‌ఓల సమ్మెట

సీహెచ్‌ఓల సమ్మెట 
2
2/4

సీహెచ్‌ఓల సమ్మెట

సీహెచ్‌ఓల సమ్మెట 
3
3/4

సీహెచ్‌ఓల సమ్మెట

సీహెచ్‌ఓల సమ్మెట 
4
4/4

సీహెచ్‌ఓల సమ్మెట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement