చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య ముఖ్యమని ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంతపేటలో ఉన్న బృందావన్ సీబీఎస్‌ఈ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. చిత్తూరు పొక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాల ప్రాధాన్యం తెలియజేయాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శైలజా కుమారి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు క్రీడల్లో, విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్‌లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మ న్ విజయభాస్కరరావ్, డైరెక్టర్ ప్రియతేజ, ఇండియన్ బ్యాంక్ బీఎం మురళికృష్ణ, విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.