
తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లెకు చెందిన మత్తయ్య పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. కాళ్లు కదపలేని పరిస్థితి. మంచానికే పరిమితమయ్యాడు. గతంలో ఆస్పత్రికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు ఆటోలో చిత్తూరుకు తీసుకెళ్లేవారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే అక్కడ ఫీజులు తడిసి మోపేడయ్యేవి. ఫ్యామిలీ ఫిజీషియన్ వచ్చాక ఇంటి వద్దకే డాక్టర్లు వెళుతున్నారు. మత్తయ్యకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన మందులు, మాత్రలు ఇస్తున్నారు. ఫలితంగా వ్యయ ప్రయాసలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. దీనిపై మత్తయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్పత్రికి వెళ్లే పెద్ద కష్టం తప్పిందని వెల్లడిస్తున్నాడు.