భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు | Sakshi
Sakshi News home page

భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు

Published Mon, Jun 10 2024 9:57 PM

Young Indians drive surge in travel to Thailand

భారత్‌ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్‌లాండ్‌కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్‌లు థాయ్‌లాండ్‌లో తమ సంస్థ రూముల్ని బుక్‌ చేసుకున్నారని తెలిపింది.

హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్‌లో థాయ్‌లాండ్‌కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్‌బీఎన్‌బీ డేటా హైలెట్‌ చేసింది.

భారతీయులు థాయ్‌లాండ్‌ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్‌ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.

దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్‌లాండ్‌లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.

ఎయిర్‌బీఎన్‌బీ
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్‌, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్‌, ఇతర సేవలందిస్తోంది.

జెన్‌జెడ్‌ అంటే 
1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్‌ జెడ్‌ (జెన్‌ జెడ్‌)గా పరిగణిస్తారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement