
పాన్ కార్డు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ట్యాక్స్, రిటర్న్స్ వంటి ముఖ్యమైన ఆర్థిక పత్రాలను దాఖలు చేయడం దగ్గర నుంచి.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా ఎక్కువ లావాదేవీలు (అధిక విలువ లావాదేవీలు) నిర్వహించడానికి పాన్ కార్డు చాలా ముఖ్యం. అయితే పాన్ కార్డుపై ఉన్న 10 అంకెల గురించి మాత్రం చాలామందికి తెలియదు.
పాన్ కార్డుపై కనిపించే.. ఆల్ఫా న్యూమరిక్ 10 అంకెల కోడ్ మీకు యాదృచ్చికంగా అనిపించవచ్చు. కానీ ఇందులోని ప్రతి అంకెకు నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూసేద్దాం..
పాన్ కార్డ్ నెంబర్ నిర్మాణం
●ఉదాహరణకు.. ఒక పాన్ కార్డు మీద ABCDS1234R అనే అంకె ఉందనుకుందాం
●ఇందులోని మొదటి మూడు అక్షరాలకు ఎటువంటి అర్థం లేదు. అవి యాదృచ్ఛికం. 4వ అక్షరం మాత్రం పాన్ హోల్డర్ రకాన్ని సూచిస్తుంది. 5వ అక్షరం హోల్డర్ పేరు మీద ఆధారపడి ఉంటుంది
●6 నుంచి 9 అక్షరాలు హోల్డర్‌కు ప్రత్యేకంగా కేటాయించినవి. చివరి అక్షరం చెక్ డిజిట్. ఇది మీ పాన్ కార్డు నకిలీ చేయబడకుండా లేదా మోసాన్ని నిరోధించడానికి ఒక ఫార్ములా ద్వారా రూపొందించారు
మీ పాన్ నెంబర్ ABCPK1234D అయితే
●ABC అనేది సిరీస్
●P అది ఒక వ్యక్తికి చెందినదని
●K అంటే కార్డుదారుడి ఇంటిపేరు Kతో ప్రారంభమవుతుందని సూచిస్తుంది
●1234 అనేది సీరియల్ నంబర్
●D అనేది ప్రామాణికతను ధృవీకరించడానికి చెక్ డిజిట్
ఇదీ చదవండి: కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై డీఎఫ్ఎస్ఏ ఆంక్షలు