ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే | Interesting Facts About World Smallest Camera With The Size Of A Grain Of Sand In Telugu | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే

Dec 22 2024 5:46 PM | Updated on Dec 22 2024 6:27 PM

World Smallest Camera Details

ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్‌ సెన్సర్‌ చిప్‌. అమెరికన్‌ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్‌’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్‌ సెన్సర్‌ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.

‘చిప్‌ ఆన్‌ టిప్‌’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్‌ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్‌ సెన్సర్‌ చిప్‌గా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు  0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.

ఇది 48 మెగాపిక్సెల్‌ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్‌ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement