విప్రో ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌: జీతాల పెంపు ఇప్పుడే కాదు..

Wipro postpone salary hike to Q3 will pay 80 pc variable pay for Q1 FY24 - Sakshi

Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్‌లో వేతన పెంపును అమలు చేసిన విప్రో  కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును  మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది.  ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది.

వేరియబుల్‌ పే 80 శాతం
ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ జతిన్‌ దలాల్‌ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్‌ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్‌ పే అవుట్‌ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు.

విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్‌లందరినీ ఇంకా ఆన్‌బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ  ఆన్‌బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది.

మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్‌ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్‌ లెవెల్‌ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్‌సీఎల్‌ కంపెనీ మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది.

ఇదీ చదవండి: లేఆఫ్స్‌ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top