చైనా ఫార్మా ఆర్డర్లు భారత్‌కి | Why Global Pharma is Ditching China for India in 2026 | Sakshi
Sakshi News home page

చైనా ఫార్మా ఆర్డర్లు భారత్‌కి

Oct 7 2026 8:45 AM | Updated on Oct 7 2026 8:45 AM

Why Global Pharma is Ditching China for India in 2026

ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుండటం భారత్‌లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) ప్రయోజనకరంగా మారుతోంది. చైనాకు వెళ్లాల్సిన ఆర్డర్లు మన సంస్థలకు వస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా డ్రగ్‌ ఇంటర్మీడియరీ కాంట్రాక్టులు ఉంటున్నాయి. సీపీహెచ్‌ఐ వరల్డ్‌వైడ్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్న దేశీ ఎస్‌ఎంఈ సంస్థలు ఈ విషయాలు తెలిపాయి. ఈ ఎక్స్‌పోలో సుపర్ణ కెమికల్స్, డెక్కన్‌ న్యూట్రాస్యూటికల్స్‌ తదితర 40 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.

దేశీయంగా ముడివనరులు, కార్మికులపై వ్యయాలు తక్కువగా ఉండటంతో ఇంటర్మీడియట్స్‌, ఏపీఐల (యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌) విషయంలో భారత్‌ దీటుగా పోటీనిస్తోందని క్లారియోన్‌ ఆర్గానిక్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ తివారీ తెలిపారు. దీనితో గతంలో చైనాకి వెళ్లిన అమెరికన్‌ కంపెనీల ఆర్డర్లు ఇప్పుడు తమకు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, కంపెనీలు చైనాను పూర్తిగా విడిచిపెట్టడం లేదని, భారత్‌లాంటి ప్రత్యామ్నాయ వనరులను తయారు చేసుకుంటున్నాయని ఫైన్‌కెమ్‌ సీఈవో భరత్‌ ధనక్‌ చెప్పారు. మరోవైపు, భారత్‌ ఇప్పటికీ ముడివస్తువుల కోసం చైనాపైనే ఆధారపడుతోంది కాబట్టి ధరల విషయంలో పూర్తి స్థాయిలో పోటీపడలేకపోతోందనే అభిప్రాయాన్ని మరికొన్ని సంస్థలు తెలిపాయి.

ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement