ఈపీఎఫ్‌ వడ్డీ ఎ‍ప్పుడంటే.. | When will EPF interest be credited for FY 2023 24 | Sakshi
Sakshi News home page

EPF Update: ఈపీఎఫ్‌ వడ్డీ ఎ‍ప్పుడంటే..

Published Mon, Jul 8 2024 8:04 PM | Last Updated on Mon, Jul 8 2024 8:27 PM

When will EPF interest be credited for FY 2023 24

EPF Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటును పెంచుతున్నట్లు గత ఫిబ్రవరిలో ప్రకటించింది. గత ఏడాది 8.15% ఉన్న వడ్డీ రేటును 2023-24కి 8.25%కి పెంచింది.

కానీ ఇప్పటి వరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి పనికొచ్చే సమాచారం ఈ కథనంలో ఇస్తున్నాం..

కొనసాగుతున్న ప్రక్రియ
ఈపీఎఫ్‌ వడ్డీ ఎప్పుడు వస్తుందని సభ్యుడొకరు ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’లో ప్రశ్నించగా ఈపీఎఫ్‌వో స్పందించింది. వడ్డీని జమచేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. కాబట్టి అతి త్వరలో మీ ఖాతాలో వడ్డీ డబ్బు కనిపించే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌పై వడ్డీని బడ్జెట్ తర్వాత అంటే జూలై 23 తర్వాత బదిలీ చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 28.17 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో ఈపీఎఫ్‌ఓ ​​జమ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ని తరచుగా PF (ప్రావిడెంట్ ఫండ్) అంటారు. ప్రైవేటు ఉద్యోగులకు ఇది ముఖ్యమైన పొదుపు, పెన్షన్ పథకం. ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు ఈ ఫండ్ మొత్తం అందుతుంది. మధ్యలో పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. 

ఈపీఎఫ్‌, ఎంపీ చట్టం ప్రకారం, ఉద్యోగి తన నెలవారీ ఆదాయంలో 12% ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలి. అదే మొత్తాన్ని కంపెనీ కూడా జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బులో 3.67% ఈపీఎఫ్‌ ఖాతాలో, మిగిలిన 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి వెళుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement