స్మార్ట్‌ఫోన్‌లకు మైక్రోస్కోప్‌.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే?

What is the Fingertip Microscope - Sakshi

వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్‌ స్మార్ట్‌ఫోన్‌కు మైక్రోస్కోప్‌ చూపునిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా లెన్స్‌కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్‌ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో ఉన్నంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు.

ఈ లెన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ లెన్స్‌లో సాధారణంగా కనిపించే వస్తువులను వాటి పరిమాణానికి పన్నెండువందల రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. దీని ద్వారా తీసే ఫొటోల రిజల్యూషన్‌ 700ఎన్‌ఎం ఉంటుంది.

ఈ మైక్రోస్కోపిక్‌ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అమర్చుకుంటే, రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, చంద్రుడిని అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సుదూర దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అమెరికన్‌ కంపెనీ ‘ఐ మైక్రోస్కోప్‌’ ఈ లెన్స్‌ను ‘ఐమైక్రో క్యూ3’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర 35 డాలర్లు (రూ.2,910) మాత్రమే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top