Vande Bharat Express Sleeper Trains, Titagarh Rail Systems Bhel Consortium Bags Rs 24000 Cr Contract - Sakshi
Sakshi News home page

వేలకోట్ల వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నదెవరో తెలుసా?

Jun 16 2023 7:57 AM | Updated on Jun 16 2023 9:33 AM

Vande Bharat Express Sleeper Trains coming Soon titagarh rail systems bhel consortium Rs 24000 Cr Contract - Sakshi

న్యూఢిల్లీ: దేశీ రైల్వేలు కొత్తగా ప్రవేశపెట్టదలచిన వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్టును టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) కన్సార్షియం దక్కించుకుంది. తద్వారా మొత్తం 80 స్లీపర్‌ ట్రైయిన్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటిని 2029కల్లా అందించవలసి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో టిటాగఢ్, భెల్‌ తెలియజేశాయి. 

మొత్తం కాంట్రాక్టు విలువను ర. 24,000 కోట్లుగా వెల్లడించాయి. దేశీ సంస్థల కన్సార్షియంకు ఈ స్థాయి విలువలో రైల్వే శాఖ కాంట్రాక్టునివ్వడం ఇదే తొలిసారికాగా.. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల డిజైన్, తయారీతోపాటు.. 35 ఏళ్లపాటు నిర్వహణను చేపట్టనున్నాయి. టెండర్‌ విధానంలో ఏకైక ఆత్మనిర్భర్‌ కన్సార్షియంగా టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్, బీహెచ్‌ఈఎల్‌ కన్సార్షియం నిలిచింది.

(ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్‌లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ)

రెండేళ్లలో..: వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్టును ఆరేళ్లలో పూర్తి చేయవలసి ఉన్నట్లు టిటాగఢ్‌ రైల్‌ వైస్‌చైర్మన్, ఎండీ ఉమేష్‌ చౌధరీ తెలియజేశారు. తొలి ప్రొటోటైప్‌ రైలును రెండేళ్లలోగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి మిగిలిన రైళ్లను అందించనున్నట్లు వివరించారు. 

(ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!)

ప్రతీ రైలుకు 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా సువరు 887 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్‌ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచి్చన మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రైళ్ల తయారీలో చివరి దశ అసెంబ్లీ, పరిశీలన, నిర్వహణ వంటివి చెన్నైలోని దేశీ రైల్వే ప్లాంటులో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement