అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు | US Brand GM to Lay Off 200 Employees | Sakshi
Sakshi News home page

అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు

Apr 12 2025 4:24 PM | Updated on Apr 12 2025 4:38 PM

US Brand GM to Lay Off 200 Employees

2025లో కూడా లేఆప్స్ సర్వ సాధారణం అయిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం లెక్కలు మించిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (GM) చేరింది.

జనరల్ మోటార్స్ కంపెనీ.. ఆల్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ నుంచి 200 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీరిని మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా.. ఉత్పత్తి సర్దుబాటులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుకు.. టారిఫ్‌ల ప్రభావం కాదని సంస్థ స్పష్టం చేసింది.

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఫ్యాక్టరీ జీరోలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్‌లో సంస్థ హై ప్రొఫైల్ ఈవీ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో చేవ్రొలెట్ సిల్వరాడో, జీఎంసీ సియెర్రా ఈవీ, హమ్మర్ ఈవీ పికప్ వంటి వాటితో పాటు రాబోయే కాడిలాక్ ఎస్కలేడ్ ఐక్యూ ఉన్నాయి.

ఇదీ చదవండి: యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్‌పీసీఐ

Advertisement
 
Advertisement
Advertisement