తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్యాంకు | Unity Small Finance Bank forayed in Hyderabad by opening five branches | Sakshi
Sakshi News home page

Unity Bank: తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్యాంకు

Jul 30 2024 1:59 PM | Updated on Jul 30 2024 3:47 PM

Unity Small Finance Bank forayed in Hyderabad by opening five branches

తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఇందర్‌జిత్‌ కామోత్రా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సేవలను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ బ్యాంకు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) వర్గాలు రుణాలు పొందవచ్చు. ప్రాథమికంగా హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ప్రారంభిస్తున్నాం. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ బ్యాంకు బ్రాంచీలు మొదలుపెడతాం. దేశ వ్యాప్తంగా యూనిటీ బ్యాంకుకు 182 శాఖలున్నాయి. వచ్చే ఏడాదిన్నరలో వీటిని 300కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. వీటితోపాటు 130కి పైగా అసెట్‌ బ్రాంచీలు ఏర్పాటు చేస్తాం. మొత్తం బ్యాంకుకు రూ.7,500 కోట్ల డిపాజిట్లు, రూ.8,500 కోట్ల రుణాలున్నాయి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement