మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే.. | TVS Raider 125 Sales 10 Lakh in 3 Years | Sakshi
Sakshi News home page

మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే..

Oct 25 2024 9:19 PM | Updated on Oct 25 2024 9:56 PM

TVS Raider 125 Sales 10 Lakh in 3 Years

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన 'టీవీఎస్ రైడర్ 125' బైక్.. అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 2021లో లాంచ్ అయిన తరువాత మొత్తం 10,07,514 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. మూడేళ్ళ కాలంలో ఈ బైక్ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

గత ఆర్ధిక సంవత్సరం నాటికి టీవీఎస్ రైడర్ మొత్తం 7,87,059 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2,12,941 యూనిట్ల సేల్స్ సాధించింది. మొత్తం మీద ఈ బైక్ సేల్స్ 10 లక్షల యూనిట్లు దాటేసింది.

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ బైక్ ఐజీఓ ఎడిషన్ రూపంలో రూ. 98,389 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. ఇది 124.8 సీసీ ఇంజిన్ కలిగి 11.22 Bhp పవర్, 11.75 Nm టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement