తగ్గనున్న టమాటా ధరలు | Tomato And Other Vegetables Prices May Ease In Coming Weeks, Know Reason Inside | Sakshi
Sakshi News home page

తగ్గనున్న టమాటా ధరలు

Jul 14 2024 8:43 AM | Updated on Jul 14 2024 11:10 AM

Tomato prices may ease in coming weeks

దేశంలో టమాటా ధరలు మరింత తగ్గనున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కిలో రూ.75 కి పెరిగిన రిటైల్ టమాటా ధర, దక్షిణాది రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగుపడటంతో రాబోయే వారాల్లో తగ్గుతుందని ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

ధరల పెరుగుదలకు కారణాలు
"ఢిల్లీతోపాటు కొన్ని ఇతర నగరాల్లో టమాటా, బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వర్షపాతం కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల వినియోగ ప్రాంతాల్లో ధరలు పెరిగాయి" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పీటీఐకి తెలిపారు. న్యూఢిల్లీలో టమాటా ధర కిలోకు రూ.75కి పెరిగింది. అయితే భారీ వర్షాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించకపోతే తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జూలై 12న ఢిల్లీలో రిటైల్ టమాటా ధర కిలోకు రూ.75గా ఉంది. ముంబైలో రూ.83, కోల్‌కతా రూ.80లుగా టమాటా ధరలు నమోదయ్యాయి. జూలై 12న దేశవ్యాప్తంగా టమాటా సగటు రిటైల్ ధర కేజీకి 65.21 లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.53.36 ఉండేది.

టమాటా ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..
ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా అవుతోంది. “ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి హైబ్రిడ్ టమాటాలు దేశ రాజధానికి చేరుకోవడంతో ధరలు తగ్గుతాయి” అని అధికారి తెలిపారు.

సబ్సిడీతో కూడిన టమాటా అమ్మకాలను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించడం లేదు. గత ఏడాది కిలో ధర రూ.110 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చర్యను అమలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక నుంచి సరఫరా మెరుగుపడటంతో 1-2 వారాల్లో ధరలు సాధారణ స్థితికి వస్తాయని అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement