
గత కొన్ని రోజులుగా లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 334.16 పాయింట్ల లాభంతో 69199.27 వద్ద, నిఫ్టీ 103.50 పాయింట్ల లాభంతో 20790.30 వద్ద కొనసాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఉన్నాయి. HCL టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా సంస్థలు నష్టాల్లో సాగుతున్నాయి. ఈ రోజు బ్యాంకింగ్ సెక్టార్ లాభాలలో ప్రయాణించగా.. ఆటోమొబైల్ కంపెనీలు నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).