సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Today Stock Market Updates 24th November 2023 - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 66060 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 19820 వద్ద ట్రేడవుతున్నాయి. 

సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌రెడ్డీస్‌ ల్యాబ్స్‌,ఎన్‌టీపీసీ,పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఎల్‌టీఐమైండ్‌ ట్రీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, హిందాల్కో, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరోమోటో కార్ప్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

గురువారం థ్యాంక్స్‌ గివిండ్‌ డే సందర్భంగా అమెరికన్‌ స్టాక్‌మార్కెట్లు పనిచేయలేదు. శుక్రవారం మాత్రం సగం రోజు మాత్రమే ట్రేడింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ ఫలితాల్ని రాబట్టే అవకాశం ఉందని మార్కెట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉండగా.. వాటిల్లో ప్రధానంగా జులై నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికం .. ఈ  రెండు త్రైమాసికాలలో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ కుదింపుకు గురైందని విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో తేలింది. 

మరోవైపు ఏఎస్‌ఎక్స్‌ (ఆస్ట్రేలియా), నిఖాయ్‌ (టోక్యో) మార్కెట్లు పాజిటీవ్‌లో ట్రేడ్‌ అవుతుండగా, కాస్పీ (కొరియా), షాంఘై (చైనా) ఈ మూడు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లే పడే అవకాశం ఉందని అంచనాల మద్య దేశీయ స్టాక్‌ సూచీలు మిక్స్‌డ్‌ ఫలితాల్ని రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top