ప్చ్‌.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్‌! | Today Gold And Silver Prices June 13th, 2025 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: ప్చ్‌.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్‌!

Jun 13 2025 11:21 AM | Updated on Jun 13 2025 1:35 PM

today gold and silver rates on telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.92,950 (22 క్యారెట్స్), రూ.1,01,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.1,950, రూ.2,120 పెరిగింది.

చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,120 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.92,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

 Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,950 పెరిగి రూ.93,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,120 పెరిగి రూ.1,01,550 వద్దకు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement