ఆశలను ఆవిరి చేస్తున్న ధరలు!.. మూడోరోజు పెరిగిన బంగారం, వెండి | Today Gold And Silver Price 1st August 2024 | Sakshi
Sakshi News home page

ఆశలను ఆవిరి చేస్తున్న ధరలు!.. మూడోరోజు పెరిగిన బంగారం, వెండి

Aug 2 2024 10:55 AM | Updated on Aug 2 2024 11:06 AM

Today Gold And Silver Price 1st August 2024

దేశంలో మూడో రోజూ బంగారం ధరలు పెరుగుదలవైపే అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం (ఆగష్టు 2) కూడా పసిడి ధరలు అమాంతం దూసుకుపోతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64800 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70690 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.300, రూ.330 పెరిగింది.

చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 300, రూ. 320 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64600 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 70470 వద్ద ఉన్నాయి.

దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70840 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది.

వెండి ధరలు
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. గురువారం రూ. 600 పెరిగిన వెండి ధర శుక్రవారం (ఆగష్టు 2) రూ. 100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 87200కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement
 
Advertisement
Advertisement