టీసీఎస్‌కు ఊహించినంత లాభాలు, ఆదాయం | TCS Q2 results Net profit rises revenue up IT Giant Dividend Record Date | Sakshi
Sakshi News home page

TCS Q2 Results: టీసీఎస్‌కు ఊహించినంత లాభాలు, ఆదాయం

Oct 8 2026 5:47 PM | Updated on Oct 8 2026 6:06 PM

TCS Q2 results Net profit rises revenue up IT Giant Dividend Record Date

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS‌) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 4 శాతం పెరిగింది. అదే సమయంలో వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

త్రైమాసికంలో టీసీఎస్‌ నికర లాభం రూ.13,884 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే లాభంలో వృద్ధి నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ రూ.13,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం కూడా స్వల్పంగా పెరిగి రూ.73,188 కోట్లకు చేరింది. లాభం, ఆదాయం రెండూ విశ్లేషకుల అంచనాలకు దాదాపు అనుగుణంగా నమోదయ్యాయి.

అక్టోబర్‌ 14 రికార్డు తేదీ

డివిడెండ్‌కు అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు అక్టోబర్‌ 14, 2026ను రికార్డు తేదీగా టీసీఎస్‌ నిర్ణయించింది. ఆ తేదీ నాటికి కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో లేదా డిపాజిటరీల రికార్డుల్లో ఈక్విటీ షేర్ల ప్రయోజనకర యజమానులుగా నమోదైన వారికి డివిడెండ్‌ లభిస్తుంది.

అర్హత పొందిన వాటాదారులకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను అక్టోబర్‌ 30, 2026న చెల్లించనున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన సమాచారంలో తెలిపింది. దీంతో త్రైమాసిక ఫలితాలతో పాటు డివిడెండ్‌ ప్రకటనపై కూడా టీసీఎస్‌ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.

ఇదీ చదవండి: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. భారత్‌లోనూ ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement