Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన 

tax exemption on leave encashment limit raised to rs 25 lakh - Sakshi

ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు.

ఇదీ చదవండి: సూపర్‌ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్‌: ధర  రూ.15 వేల లోపే

సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. (మరో సంచలనం: బ్రెయిన్‌ చిప్‌, మస్క్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉ‍ద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది.

ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్‌-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!

మరిన్ని బిజినెస్‌ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top