మరో సంచలనం: బ్రెయిన్‌ చిప్‌, మస్క్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ 

Neuralink Elon Musk gets approval to put computer chip in human brains - Sakshi

 మనిషి మెదడులో చిప్ పరిశోధనలకు మస్క్‌కు అనుమతి   

సాక్షి, ముంబై: టెస్లా అధినేత మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ను (Chip In Brain) ప్రవేశ పెట్టే ప్రయోగాలకు  గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి అనుమతి లభించిందని ఎలాన్ మస్క్ ట్విటర్‌ ద్వారా  ప్రకటించారు. 

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇన్-హ్యూమన్ క్లినికల్ స్టడీకి సంబంధించి అనుమతో మరో చారిత్ర ప్రయోగానికి నాంది పడనుంది. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్‌లతో లింక్ చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారిని వాలంటీర్లుగా ఎంపిక చేసి ప్రయోగాలు చేపట్టనుంది. ఇది ముఖ్యమైన ముందడుగు. తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఆమోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేసింది. (వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు)

కాయిన్ సైజ్ (అంచనా) చిప్‌ను కోతుల మెదడులో  అమర్చి ఇప్పటికే ప్రయోగాలు చేసింది సంస్థ. ఈ ఫలితాలతో రూపొందించిన నివేదికలను న్యూరాలింక్ కంపెనీ ఎఫ్‌డీఏ ముందుంచింది. వీటిని పరిశీలించిన రెగ్యులేటరీ బ్రెయిన్ చిప్‌ వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది.  (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్‌, స్పందించిన కంపెనీ )

కాగా గత ఏడాది డిసెంబర్‌లో న్యూరాలింక్ డివైస్‌ పరీక్షలకు సిద్ధంగా ఉందని మస్క్ వెల్లడించాడు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలని భావించాడు. కానీ మార్చి 2023లో భద్రతా ప్రమాదాల రీత్యా మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలపై  న్యూరాలింక్ అభ్యర్థనను ఎఫ్‌డీఏ తిరస్కరించింది.

పక్షవాతం, అంధత్వం వంటి తీవ్రమైన వ్యాధులకు బ్రెయిన్ చిప్ ద్వారా సాధ్యమవుతుందని  న్యూరాలింక్ విశ్వసిస్తోంది. మెదడు ఇంప్లాంట్  మానవ పరీక్షల కోసం 2019 నుండి మస్క్ వెయిట్‌ చేస్తున్నాడు. ఏఐని తీవ్రంగా వ్యతిరేకించే మస్క్‌ దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని  చెబుతున్న సంగతి తెలిసిందే. (విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌)

న్యూరాలింక్ 
న్యూరాలింక్ అనే న్యూరోటెక్నాలజీ కంపెనీని 2016లోమస్క్‌ స్థాపించాడు. మానవమెదడు, కంప్యూటర్‌లు లేదా ఇతర బాహ్య పరికరాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలా ఇంప్లాంటబుల్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను (BCIలు) అభివృద్ధి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో విలీనం చేయడం ద్వారా మానవ జ్ఞానాన్ని మెరుగుపరచడం , నాడీ సంబంధిత రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కోవడం.

ఇలాంటి మరెన్నో విశేషమైన వార్తలు, అప్‌డేట్స్‌ కోసం సాక్షిబిజినెస్‌ చదవండి:

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top