ట్యాక్స్‌ కోడ్‌ను సరళీకరించాలి: మస్క్‌ | tax codes among Western countries really highlights the complexities and differences in each nation | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ కోడ్‌ను సరళీకరించాలి: మస్క్‌

Published Fri, Nov 29 2024 2:19 PM | Last Updated on Fri, Nov 29 2024 3:34 PM

tax codes among Western countries really highlights the complexities and differences in each nation

అమెరికాలో ట్యాక్స్‌ విధానాలను మరింత సరళతరం చేయాలనేలా యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సారథిగా నియమితులైన ఇలాన్‌మస్క్‌ తెలిపారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌రామస్వామిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. రానున్న ట్రంప్‌ పాలన కాలంలో అమెరికాలోని పన్ను విధానాలను సరళీకృతం చేయాలని మస్క్‌ యోచిస్తున్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్లిష్టంగా ఉన్న పన్ను విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో వెలసిన పోస్ట్‌కు ఇలాన్‌మస్క్‌ స్పందించారు. పాశ్చాత్య దేశాల్లో యూకే తర్వాత పన్ను అమలుకు సంబంధించిన విధానాలను గరిష్ఠంగా అమెరికా అనుసరిస్తుందని, దాన్ని మరింత హేతుబద్ధీకరించి సరళంగా మార్చాలని యోచిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. వెస్టర్న్‌ దేశాల్లో  ట్యాక్స్‌ కోడ్‌కు సంబంధించిన విధానాలు యూకేలో 17,000+ పేజీలున్నాయి. తర్వాతి స్థానంలో యూఎస్‌ 6,800 పేజీలు కలిగి ఉంది. ట్యాక్స్‌ విధానాలపై చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొనకుండా చాలా దేశాలు వాటిని సరళీకరిస్తున్నాయి. స్వీడన్‌ కనిష్టంగా కేవలం 100 పేజీల పన్ను విధానాలను అమలు చేస్తోంది.

ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!

వెస్టర్న్‌ దేశాల్లో తక్కువ పేజీలతో ట్యాక్స్‌కోడ్‌ అమలు చేస్తున్న ప్రాంతాలు

  • యునైటెడ్ కింగ్‌డమ్: 17,000+ పేజీలు

  • యునైటెడ్ స్టేట్స్: 6,800 పేజీలు

  • ఆస్ట్రేలియా: 5,000 పేజీలు

  • కెనడా: 3,000 పేజీలు

  • జర్మనీ: 1,700 పేజీలు

  • ఫ్రాన్స్: 1,500 పేజీలు

  • స్పెయిన్: 1,000 పేజీలు

  • ఇటలీ: 800 పేజీలు

  • నెదర్లాండ్స్: 400 పేజీలు

  • స్వీడన్: 100 పేజీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement