20 ఏళ్లకే క్యాన్సర్‌.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్‌.. | Sakshi
Sakshi News home page

Kanika Tekriwal Success Story: 20 ఏళ్లకే క్యాన్సర్‌.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్‌..

Published Sat, Feb 17 2024 6:20 PM

Success Story About JetSetGo Founder Kanika Tekriwal - Sakshi

ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'కనికా టేక్రీవాల్‌'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సృష్టించిన సామ్రాజ్యం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

1990లో భోపాల్‌లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రీవాల్‌.. స్కూల్ ఏజికేషన్ మొత్తం లారెన్స్, లవ్‌డేల్‌ పాఠశాలల్లో పూర్తి చేసి, కోవెంట్రీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత 2012లో జెట్‌సెట్‌గో (JetSetGo) సంస్థ స్థాపించి అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించి.. అతి చిన్న వయసులోనే కంపెనీని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

చదువుకునే రోజుల్లో క్యాన్సర్ భారిన పడిన కనికా టేక్రీవాల్‌ ఆ సమయంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి మళ్ళీ సైక్లింగ్ ట్రాక్‌లో పడిన 'లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్' (Lance Armstrong) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని జెట్‌సెట్‌గో స్టార్ట్ చేసింది.

2012లో కంపెనీ ప్రారంభించిన తరువాత దేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగి 6000 విమానాలను విజయవంతంగా నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇందులో చార్టడ్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్ కూడా ఉన్నట్లు సమాచారం. నేడు వ్యాపార రంగంలో తనదైన రీతిలో ఎదుగుతూ.. 33 సంవత్సరాల వయసులో 10 సొంత ప్రైవేట్ జెట్‌లను కలిగి.. సుమారు రూ. 420 కోట్లకు అధినేతగా నిలిచింది.

ఇదీ చదవండి: మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..

20 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భారిన పడి రెండేళ్ల కాలంలో కోలుకుని, సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. 33 ఏళ్ల వయసులో రూ. 420 కోట్లు సంపాదించగలిగిందంటే.. దాని వెనుక కనికా టేక్రీవాల్‌ కృషి అన్యన్య సామాన్యమనే చెప్పాలి. ఇది ఎంతోమంది యువతకు మార్గదర్శం కావాలి.

Advertisement
 
Advertisement