రియల్‌ ఎస్టేట్‌లో మళ్లీ ఆశావాదం | Strong Economic Growth Boosts Optimism in India Real Estate Market | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌లో మళ్లీ ఆశావాదం

Nov 26 2026 7:31 AM | Updated on Nov 26 2026 7:31 AM

Strong Economic Growth Boosts Optimism in India Real Estate Market

దేశ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఆశావాద ధోరణి పెరుగుతోంది. రానున్న ఆరు నెలల్లో ప్రాపర్టీ మార్కెట్‌ వృద్ధి అవకాశాలపై డెవలపర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బుల్లిష్‌గా ఉన్నాయని నరెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (క్యూ2) సంబంధించిన 50వ ఎడిషన్‌ ‘రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌’ నివేదికను ఇరు సంస్థలు మంగళవారం సంయుక్తంగా విడుదల చేశాయి. దీని ప్రకారం ప్రస్తుత సెంటిమెంట్‌ స్కోరు గత త్రైమాసికంలోని 48 నుంచి 56కు, భవిష్యత్‌ సెంటిమెంట్‌ స్కోరు 50 నుంచి 58కి పెరిగాయి. దీంతో రెండు త్రైమాసికాల తర్వాత సూచీ మళ్లీ ఆశావహ స్థాయికి చేరింది.

క్యూ1లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందడం, నివాస గృహాలు, కార్యాలయ స్థలాల మార్కెట్లపై అంచనాలు మెరుగుపడటం ఇందుకు దోహదపడిందని నివేదిక పేర్కొంది. అయితే పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీరేట్ల పెంపు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని నైట్‌ ఫ్రాంక్‌ సూచించింది. నిర్మాణ, రుణ వ్యయాలు పెరుగుతున్నందున డిమాండ్‌కు తగ్గట్టుగానే సరఫరా ఉండాలని నరెడ్కో జాతీయాధ్యక్షుడు ప్రవీణ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement