దిస్‌ ఈజ్‌ బిజినెస్‌: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పోటీ.. తారలకు తారాస్థాయి రెమ్యునరేషన్లు

Streaming Platforms Doing Business With Stars Remuneration - Sakshi

Hollywood Stars Remuneration: డేనియల్‌ క్రెయిగ్‌.. బాండ్‌ సినిమాలు చూసేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 53 ఏళ్ల ఈ బ్రిటిష్‌ యాక్టర్‌ తాజాగా భారీ రెమ్యునరేషన్‌తో వార్తల్లో నిలిచాడు. నైవ్స్‌ అవుట్‌ సీక్వెల్స్‌ కోసం ఏకంగా 100 మిలియన్ల డాలర్ల(744 కోట్ల రూపాయల) పారితోషికం నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అందుకున్నాడు డేనియల్‌ క్రెయిగ్‌. తద్వారా హాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్‌గా(సింగిల్‌ మూవీ సిరీస్‌తో) నిలిచాడు. ఇది బాండ్‌ సినిమాలన్నింటి ద్వారా క్రెయిగ్‌ అందుకున్న రెమ్యునరేషన్‌ కంటే చాలా ఎక్కువే కావడం విశేషం!..

సినిమా.. ఎప్పటికీ ఓ భారీ వ్యాపారం. అందుకే ఈ కరోనా టైంలో పెద్ద సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతీదాంట్లోనూ అడ్వాన్స్‌డ్‌గా ఉండే హాలీవుడ్‌.. ఇప్పుడు తారల రెమ్యునరేషన్‌ విషయంలోనూ తొలి అడుగు వేసింది. థియేటర్లకు ఆడియొన్స్‌ దూరం అవుతున్నారని పసిగట్టి.. ఓటీటీ సర్వీసులతో వ్యూయర్స్‌ను ఎంగేజ్‌ చేస్తున్నాయి. తారలకు గాలం వేసి సొంత సినిమాలు తీస్తున్నాయి. ఈ క్రమంలో తారల రెమ్యునరేషన్‌ని.. ఇప్పుడు పూర్తి స్థాయి బిజినెస్‌గా మార్చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌ ముందంజ
సాధారణంగా డిస్నీ, వార్నర్‌ బ్రదర్స్‌ లాంటి సంప్రదాయ నిర్మాణ సంస్థలు, తారలకు భారీ పారితోషికాలను ఆఫర్‌ చేస్తుంటాయి. సినిమాలు రిలీజ్‌ అయ్యాక డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు స్టేజ్‌ నుంచి నిర్మాణ దశలోనే హక్కులు కొనుక్కునేంత స్థాయికి చేరింది పరిస్థితి. ఇక ఓటీటీ వినియోగం కరోనా వల్ల పెరిగాక.. నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌. ఈ క్రమంలోనే భారీ రెమ్యునరేషన్‌లతో తారల్ని టెంప్ట్‌ చేస్తున్నాయి. స్టార్‌డమ్‌.. రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు.
 

సినిమా  పేరు   -    నటుడు/నటి   -  రెమ్యునరేషన్‌-  ఓటీటీ               

నైవ్స్‌ అవుట్‌( సీక్వెల్స్‌)- డెనియల్‌ క్రెయిగ్‌ - 744 కోట్లు     - నెట్‌ఫ్లిక్స్‌
రెడ్‌ వన్‌                      - డ్వెయిన్‌ జాన్సన్‌    - 372కోట్లు       -అమెజాన్‌
డోంట్‌ లుక్‌ అప్‌            - లియోనార్డో డికాప్రియో - 222 కోట్లు    -నెట్‌ఫ్లిక్స్‌  
      "                              - జెన్నిఫర్‌ లారెన్స్‌        -  185 కోట్లు    -  "   

లీవ్‌ ది వరల్డ్‌ బిహైండ్‌       - జూలియా రాబర్ట్స్‌    -185 కోట్లు       -నెట్‌ఫ్లిక్స్‌ 
ది గ్రేమ్యాన్‌                        - ర్యాన్‌ గోస్లింగ్‌                -148 కోట్లు    - నెట్‌ఫ్లిక్స్‌


మిగతావాటి పరిస్థితి
థోర్‌ సీక్వెల్స్‌ కోసం నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌,  సాండ్రా బుల్లోక్‌ ‘ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ డీ’.. కోసం 148 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక వార్నర్‌ మీడియా వాళ్లు మాత్రం థియేట్రికల్‌ రిలీజ్‌, ఓటీటీ  స్ట్రీమింగ్‌ ఫలితాల ఆధారంగా తారలకు రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉదాహరణకు ఒక సినిమా థియేటర్స్‌-హెచ్‌బీవో మాక్స్‌లో కొద్దిరోజుల గ్యాప్‌తో రిలీజ్‌ అయితే.. లాభాల ఆధారంగానే రెమ్యునరేషన్‌ను పెంచుతాయి. ఇక రాబర్ట్‌ పాటిసన్‌ బ్యాట్‌మన్‌ సినిమా కోసం కేవలం 22 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ సినిమా హిట్‌ అయినా.. ఓటీటీ ద్వారా వ్యూయర్‌షిప్‌ దక్కించుకున్నా లేదంటే సీక్వెల్స్‌కు సిద్ధపడినా.. అప్పుడు మాత్రమే పాటిసన్‌కు రెమ్యునరేషన్‌ను పెంచుతారని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే హాలీవుడ్‌లో పాతుకుపోయిన ఈ రెమ్యునరేషన్‌ బిజినెస్‌.. ఓటీటీ జోరు కొనసాగుతున్న తరుణంలో ఈ తరహా పారితోషిక విధానం త్వరలో మన సినిమాకు వ్యాపించే ఛాన్స్‌ ఉందని సినీ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top