దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:00 సమయానికి నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు పెరిగి 23,219 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు పుంజుకొని 74,326 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నందున నిఫ్టీ 50, సెన్సెక్స్ కొద్దిగా పెరిగాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో నెస్లే ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.56 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ ఫార్మా అత్యంత క్షీణించింది.
- అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34
- బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 108.41 డాలర్లు
- యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.00 శాతానికి చేరాయి.
- గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.4 శాతం నష్టపోయింది.
- నాస్‌డాక్ 0.8 శాతం పడిపోయింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


